ఓటర్లకు ధన్యవాదాలు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన పట్టణంలోని 30 వార్డుల ప్రజలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం కాంగ్రెస్ కార్యకర్తల శ్రమకు ఫలితమన్నారు. రెండేళ్ల ప్రజాపాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారని అన్నారు. ఈ గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. రాష్ట్రంలోనే నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని చెప్పారు.


