దరఖాస్తుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల స్వీకరణ

Feb 25 2026 9:41 AM | Updated on Feb 25 2026 9:41 AM

దరఖాస

దరఖాస్తుల స్వీకరణ

సౌర ప్యానళ్ల పరిశీలన కలెక్టర్‌కు హేమాచల ఆలయ అభివృద్ధి లేఖ అందజేత

భూపాలపల్లి రూరల్‌: జాతీయ చేనేత దినోత్స వం సందర్భంగా అవార్డులకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ జిల్లా అధికా రి శ్రీకాంత్‌ రెడ్డి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. చేనేత కళాకారులు, చేనేత డిజైనర్లకు వృత్తిలో నైపుణ్యత, ప్రత్యేకతల ఆధారంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డును అందించనున్నట్లు తెలిపారు. అవార్డుకు ఎంపి కైనవారికి రూ.25,000 నగదుతోపాటు సర్టిఫికె ట్‌ అందజేసి సత్కరిస్తారని తెలిపారు. మార్చి 31లోగా సహాయ సంచాలకులు, చేనేత, జౌళి శాఖ వరంగల్‌ కార్యాలయలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు చేనేత, జౌళి శాఖ వరంగల్‌ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

ఆలయాల అభివృద్ధికి కృషి

రేగొండ : ఆలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం మండలంలోని కోటంచ ఆలయంలో ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వరుణ్‌రెడ్డి ఆలయ విశిష్టతను ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్‌ సంపత్‌రావు, ఈఓ మహేష్‌ పాల్గొన్నారు.

మల్హర్‌(కాటారం): కాటారంలో ఏర్పాటు చేసిన సౌర ప్యానళ్లను టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెడ్కో సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఇళ్లకు ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానళ్ల వివరాలను సంస్థ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటినీ సౌర విద్యుత్‌ కేంద్రంగా మార్చాలని సీఎండీ సంస్థ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ మల్చూర్‌, డీఈఈ (టెక్నికల్‌) జగదీష్‌, కాటారం డీఈఈ నాగరాజు, డీఎం రెడ్కో మహేందర్‌రెడ్డి, రమేష్‌ పాల్గొన్నారు.

పోలీస్‌ స్పోర్ట్స్‌లో జిల్లా పోలీసుల ప్రతిభ

భూపాలపల్లి: తెలంగాణ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌లో జిల్లా పోలీసులు ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన నాల్గో తెలంగాణ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ పోటీల్లో బాస్కెట్‌బాల్‌ పోటీల్లో మహదేవపూర్‌ సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రమేజ్‌ హస్సేన్‌లు బ్రాంజ్‌ మెడ ల్స్‌ సాధించారు. ఆర్మ్‌ రెజ్లింగ్‌లో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ కాశీరాం బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నారు. జిల్లాకు పతకాలు తీసుకొచ్చిన వీరిని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌, అదనపు ఎస్పీ నరేష్‌కుమార్‌ మంగళవారం అభినందించారు.

పోస్టర్‌ ఆవిష్కరణ

భూపాలపల్లి రూరల్‌: కలెక్టరేట్‌లో అధికారులు పోష యాక్ట్‌– 2013 పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి మల్లేశ్వరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, అడిషనల్‌ ఎస్పీ నరేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల భద్రత, గౌరవ పరిరక్షణలో పోష చట్టం ప్రాముఖ్యతను వివరించారు. జిల్లా ఇన్‌చార్జ్‌ సంక్షేమాధికారి మల్లీశ్వరీ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 44 అంతర్గత ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 7 ప్రైవేట్‌ సంస్థల్లో ఐసీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కృష్ణ, రాధిక, ఉమ తదితరులు పాల్గొన్నారు.

మంగపేట: హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి మంత్రి సీతక్క సిఫారసు లేఖను దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ రామల సునీత, ఆల య కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్‌, అర్చకులు కలెక్టర్‌ దివారకు మంగళవారం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా మహే శ్‌ మాట్లాడుతూ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థాన అభివృద్ధి పనులపై మంత్రి సీతక్కకు సోమవా రం ఆలయ అర్చకులు నివేదికను అందజేసిన విషయం విధితమే. ఈ మేరకు అభివృద్ధి పనులకు ఎస్టిమేషన్‌ నివేదిక సిద్ధం చేయాలని దేవాదాయశాఖ డీఈ రమేష్‌బాబును ఆదేశించారని తెలిపారు.

దరఖాస్తుల స్వీకరణ
1
1/2

దరఖాస్తుల స్వీకరణ

దరఖాస్తుల స్వీకరణ
2
2/2

దరఖాస్తుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement