శాసీ్త్రయ దృక్పథంతో కొత్త ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ దృక్పథంతో కొత్త ఆవిష్కరణ

Feb 24 2026 7:28 AM | Updated on Feb 24 2026 7:28 AM

శాసీ్త్రయ దృక్పథంతో కొత్త ఆవిష్కరణ

శాసీ్త్రయ దృక్పథంతో కొత్త ఆవిష్కరణ

భూపాలపల్లి అర్బన్‌: విద్యార్థులు శాసీ్త్రయ ధృక్పథంతో విషయాలను పరిశీలించి కొత్త ఆవిష్కరణ దిశగా అడుగులు వేయాలని సెక్టోరియల్‌ అధికారి విజయపాల్‌రెడ్డి కోరారు. జిల్లాస్థాయి ఫిజికల్‌ సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సెక్టోరియల్‌ ఆఫీసర్లు విజయపాల్‌రెడ్డి, రమేష్‌, రాజగోపాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మారుతున్న కాలానికి అనుగుణంగా సైన్స్‌ అభివృద్ధి చెందుతోందని, సైన్స్‌ ద్వారా సాధించలేనిది ఏమీ లేదని తెలిపారు. ప్రతీ విద్యార్థి శాసీ్త్రయ దృక్పథంతో విషయాలను పరిశీలించి కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించడం విద్యార్థులకు కొత్త అనుభూతిని కలిగించింద న్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ స్వామి, జిల్లా ఫిజికల్‌ సైన్స్‌ ఫోరం అధ్యక్షుడు బిల్ల రఘునాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి గండు రాజబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మిప్రసన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement