ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు
భూపాలపల్లి: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్‌లో వైద్య ఆరోగ్యశాఖ, టీజీఎంఐడీసీ అధికారులు, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటు కోసం అవసరమైన సీలింగ్, ఏసీ ఫిట్టింగ్, విద్యుత్ సరఫరా, కంప్యూటర్ మార్పులు తదితర పనులను పూర్తిచేసి నిర్ణీత గడువులోగా ఏర్పాటు చేయాలన్నారు. సిటీ స్కాన్ యంత్రం ప్రారంభమైనప్పటికీ టెక్నీషియన్ కొరత కారణంగా సేవలు అందుబాటులోకి రాలేదని, వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా సిటీ స్కాన్ టెక్నీషియన్ నియామకం చేపట్టి త్వరితగతిన సేవలను ప్రారంభించాలన్నారు. ఆస్పత్రి ఆవరణలో ఖాళీగా ఉన్న డైస్ భవనంలో ఆప్తమాలజీ, సైకియాట్రీ, ఫిజియోథెరపీ, డెంటల్ ఓపీ సేవలు ప్రారంభించి రోగులకు సేవలు అందించాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ పోస్టర్ ఆవిష్కరణ..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ పోస్టర్‌ను అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ శుక్రవారం ఆయన చాంబర్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సేవకు అంకితభావంతో ఉన్న యువతకు భారత వాయుసేనలో చేరడం ఒక గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. మన రాష్ట్రానికి చెందిన యువత ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అధిక సంఖ్యలో వాయుసేనలో చేరి దేశ రక్షణలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఆర్మీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎల్.మహిపాల్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి కె.ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.
భూసేకరణ వేగిరం చేయాలి..
జిల్లాలో చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులకు భూ సేకరణపై రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లా కు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక అభివద్ధికి దోహదపడుతుందని తెలి పారు. భూసేకరణ ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం లేకుండా, భూ యజమానులకు చట్టబద్ధంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, నేషనల్ హైవే, శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోపు భూ సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భూ యజ మానులతో చర్చలు జరిపి వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూ సేకరణ వేగిరం
కలెక్టర్ రాహుల్ శర్మ


