నిర్భయంగా ఓటేయండి
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందితో మాట్లాడారు. సిబ్బందికి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి అంబేడ్కర్ స్టేడియంలోని బ్యాలెట్ బాక్సులు నిల్వచేయడానికి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఓట్లు లెక్కింపు కోసం ఏర్పాటు చేయనున్న సింగరేణి మినీ ఫంక్షన్ హాల్‌ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ జోనా, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ తరుణ్‌ప్రసాద్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ


