వైభవంగా గట్టు మల్లన్న జాతర | - | Sakshi
Sakshi News home page

వైభవంగా గట్టు మల్లన్న జాతర

Feb 16 2026 7:23 AM | Updated on Feb 16 2026 7:23 AM

వైభవం

వైభవంగా గట్టు మల్లన్న జాతర

వైభవంగా గట్టు మల్లన్న జాతర

టేకుమట్ల: కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారమైన గట్టు మల్లన్నను దర్శించుకునేందుకు ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మండలంలోని బూర్నపల్లి గట్టుపై కొనసాగే గట్టు మల్లన్న జాతర ఆదివారం అత్యంత వైభవంగా కొనసాగింది. శనివారం చిన్న పట్నంతో మొదలై పెద్ద పట్నం ఆదివారం రాత్రి వరకు కొనసాగిన మల్లన్న పట్నాలకు మండలంతో పాటు పెద్దపల్లి, ముత్తారం మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం గట్టు మల్లన్న జాతరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ప్రత్యేక మొక్కులు చెల్లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన గట్టు మల్లన్న జాతర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. శాసనమండలి బీఆర్‌ఎస్‌ పక్షనేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

పోటెత్తిన భక్తజనం

దర్శించుకున్న పలువురు నేతలు

వైభవంగా గట్టు మల్లన్న జాతర1
1/1

వైభవంగా గట్టు మల్లన్న జాతర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement