టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ
మల్హర్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. 12 మండలాలకు సంబంధించి పాఠశాలకు ముగ్గురు చొప్పున 36 మంది 8వ, 9వ తరగతి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో మండలంలోని తాడిచర్ల జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. తాడిచర్ల ఉన్నత పాఠశాలకు చెందిన శైలాని ప్రథమ, సిరిచందన తృతీయ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వర్థిని నాలుగో స్థానంలో నిలిచింది. గైడ్ టీచర్స్‌గా వ్యవహరించిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు కుమారస్వామి, వెంకటేశ్వర్లులకు, ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరెడ్డి, ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.


