ప్రచారం ముగిసింది..
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
కోటగుళ్లలో పూజలు
గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఆశుతోష్ పాండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త అట్లూరి వెంకటలక్ష్మీనరసింహారావుతో కలిసి ఆయన ఆలయాన్ని సందర్శించారు. వారిని ఆలయ అర్చకుడు నాగరాజు సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు.
సోమవారం ప్రత్యేక పూజలు
కోటగుళ్లలో సోమవారం సందర్భంగా గణపేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు స్వా మి వారిని ప్రత్యేకంగా అలంకరించగా భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.
క్రీడానైపుణ్యం ప్రదర్శించాలి
చిట్యాల: క్రీడాకారులు క్రీడా నైపుణ్యంతో ఆడాలని డీవైఎస్‌ఓ చిర్రా రఘు అన్నారు. సోమవారం జూకల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సీఎం కప్ జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ పోటీలకు జిల్లాలోని 12 మండలాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ రఘు మాట్లాడుతూ పోటీల్లో గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు. క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరగాని కృష్ణ, ఏఎంఓ విజయపాల్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్‌లు సూదం సాంబమూర్తి, బండి ప్రసాద్, నూకల లింగయ్య, గాజర్ల శ్రీనివాస్, పూర్ణిమ, సమ్మయ్య, హేమలత, కల్యాణి, సులోచన పాల్గొన్నారు.
లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం
భూపాలపల్లి అర్బన్: లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 12న దేశ వ్యాప్త ఒక రోజు టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ.. సోమవారం ఏరియాలోని కేటీకే 5వ గనిలో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గంలో పెరుగుతున్న అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, నిరుద్యోగాన్ని నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ నాయకులు కంపేటి రాజయ్య, మధుకర్‌రెడ్డి, తిరుపతి, బుచ్చయ్య, పోషం, సమ్మయ్య, రమేష్, సారయ్య పాల్గొన్నారు.
సాక్షిప్రతినిధి, వరంగల్:
హోరెత్తిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా ఆగిపోయింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు అభ్యర్థులు ప్రచారానికి తెరవేశారు. పట్టణాల్లో సాగిన, మైకుల మోత, ప్రచారహోరు మూగబోయింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత సుమారు వారం రోజులుగా అభ్యర్థులు.. ప్రధాన పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్‌లోని 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు 1073 మంది పోటీ చేస్తుండగా.. ఒక్కో వార్డు నుంచి సగటున నలుగురైదుగురు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తరఫున ఆ పార్టీల అగ్రనాయకులు ప్రచారం నిర్వహించగా.. సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎఐఎఫ్‌బీ, రెబల్స్, ఇండిపెండెట్లు కూడా ప్రచారం సాగించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగించడంతో ఒక్కసారిగా పట్టణాల్లో మైకుల మోత ఆగిపోయింది.
ఆఖరు రోజు ప్రచార హోరు
ప్రచారం ముగింపునకు ఒక్కరోజు ముందునుంచే ఆయా పార్టీల అగ్రనేతలు, అభ్యర్థులు ప్రచారంలో హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ధనసరి సీతక్క తదితరులు ప్రచారం నిర్వహించారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కూడా విస్తృతంగా పర్యటించారు. బీఆర్‌ఎస్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఆయా నియోజకవర్గాల పరిధి మున్సిపాలిటీల్లో ప్రచారం చేశారు. బీజేపీ నుంచి రాష్ట్ర, జిల్లా నాయకులు జె.హుస్సేన్ నాయక్, డాక్టర్ కాళీప్రసాద్, చందుపట్ల కీర్తిరెడ్డి తదితరులు అభ్యర్థుల తరఫున ప్రచారంలో తిరిగారు. సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో ఆదివారం, సోమవారం రెండు రోజుల్లో ప్రధాన పార్టీలు ప్రచారవేడిని పెంచాయి. ఇదిలా ఉండగా.. ప్రచారం ముగిసిన అనంతరం మున్సిపాలిటీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పంపిణీ కార్యక్రమానికి పార్టీలు సోమవారం రాత్రినుంచే తెర తీశాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఓటర్లకు ఓటుకు రూ.1,000 నుంచి రూ.2,500.. మద్యం, మాంసం కూడా సరఫరా చేయడం చర్చనీయాంశంగా మారింది.
పోలింగ్ రోజు స్థానిక సెలవు
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల సిబ్బంది, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు అందరూ మున్సిపల్ ఎన్నికలలో తప్పనిసరిగా పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలింగ్ ఏర్పాట్ల కోసం వినియోగించనున్న ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థల భవనాల కార్యాలయాలకు నేడు(మంగళవారం) సెలవు ప్రకటించినట్లు తెలిపారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్ స్లిప్‌తో పాటు ఎన్నికల కమిషన్ అనుమతించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, రేషన్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్ తదితర గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని స్పష్టం చేశారు. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.
పోలింగ్ కేంద్రాలకు నేడు అధికారులు, సిబ్బంది..
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మొదలు కానుంది. ఈ మేరకు ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం 12 మున్సిపాలిటీల్లో 3,35,244 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 1,72,087లు కాగా, పురుషులు 1,63,088లు. ఆ మేరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి అధికారులు, సిబ్బందిని తరలించేందుకు సర్వం సిద్ధమైంది.
మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా అభ్యర్థుల ఖర్చు
నామమాత్రంగా టీమ్‌ల ఏర్పాటు
వీడియో రికార్డు లేకుండానే తనిఖీలు
నిధులు మిగుల్చుకునే పనిలో అధికారులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు
మున్సిపాలిటీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్
పరకాల గణపతి డిగ్రీ కాలేజీ
నర్సంపేట ఏఎంసీ, నర్సంపేట
వర్ధన్నపేట మున్సిపల్ ఆఫీస్
వర్ధన్నపేట
జనగామ ఏకశిల బీఈడీ కాలేజీ
స్టేషన్‌ఘన్‌పూర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్
భూపాలపల్లి సింగరేణి ఫంక్షన్ హాల్
మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ
డోర్నకల్ నిర్మల హైస్కూల్
కేసముద్రం ఏఎంసీ, కేసముద్రం
మరిపెడ సెయింట్ అగస్టిన్స్ హైస్కూల్
తొర్రూరు ఆర్యభట్ట హైస్కూల్
ములుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ
ప్రచారం ముగిసింది..
ప్రచారం ముగిసింది..


