ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

Feb 17 2026 8:15 AM | Updated on Feb 17 2026 8:15 AM

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

భూపాలపల్లి: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దివస్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్‌ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్‌ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement