బస్తీమే సవాల్‌ | - | Sakshi
Sakshi News home page

బస్తీమే సవాల్‌

Feb 7 2026 9:41 AM | Updated on Feb 7 2026 9:41 AM

బస్తీమే సవాల్‌

బస్తీమే సవాల్‌

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముమ్మరం

ప్రతీ ఓటు కీలకంగా వ్యూహాలు

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి పట్టణంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. జిల్లా కేంద్రం, నియోజకవర్గ ప్రధాన కేంద్రం కావడంతో భూపాలపల్లి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని విస్తృతం చేశాయి. ఈనెల 11న పోలింగ్‌ ఉండటం, పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం ముగించాల్సి ఉన్న తరుణంలో ఉన్న మూడు రోజుల్లో అభ్యర్థులు ప్రచారాన్ని గడపగడపకు తీసుకెళ్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఉన్న కొద్ది రోజులనే ప్రచారానికి అనువుగా ప్రణాళికలు వేసుకుంటున్నారు.

రంగంలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు

రెండు రోజులుగా ప్రచారంలో మంత్రి శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఇతర ముఖ్యనాయకులు పాల్గొనటంతో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ముమ్మరంగా వార్డుల్లో పర్యటిస్తున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులు ఉండగా 107 మంది పోటీ పడుతున్నారు. సమయం తక్కువగా ఉండటంతో ఉదయం 7–8 గంటల నుంచే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఓటర్ల గడపగడపకు వెళ్తూ తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. శుక్రవారం ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున స్థానిక నాయకులతో పాటు బండా ప్రకాశ్‌, సిరికొండ మధుసూదనచారి తమ అభ్యర్థులను గెలిపించాలని పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున గండ్ర సత్యనారాయణరావు వీరితో పాటు బీజేపీ తరఫున భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కీర్తి రెడ్డి పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా స్టార్‌ క్యాంపెయినర్లను రంగంలోకి దించుదామని ప్రధాన పార్టీలు అనుకుంటున్నప్పటికీ ప్రచారానికి తక్కువ రోజులు సమయమే ఉండటంతో వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నెల 8వ తేదీ సీఎం రేవంత్‌రెడ్డి చెల్పూరు శివారులో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఈ నెల 9న మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఆ పార్టీ తెలిపింది.

స్వతంత్రుల మద్దతు కోసం..

ప్రస్తుతం మున్సిపాలిటీ బరిలో 10 మంది ఇండిపెండెంట్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిని ప్రచారానికి దూరంగా ఉంచేందుకు అన్ని ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. స్వతంత్రులను పోటీ నుంచి తప్పించి వారి మద్దతు పొందితే గెలుపు అవకాశాలు మరింత పెరుగుతాయనే అభిప్రాయంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు.

ప్రచార బరిలోకి మంత్రులు, ఎమ్మెల్యే

ప్రతీ ఓటు కీలకం..

అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

ప్రచారానికి మరో మూడు రోజులే..

బహిరంగ సభకు సీఎం రేవంత్‌రెడ్డి,

రోడ్‌ షోకు మాజీ మంత్రి కేటీఆర్‌

ప్రస్తుతం పట్టణంలో ప్రధానంగా మూడు పార్టీలు తలపడుతుండటంతో ఓట్ల కోసం అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఒక్క ఓటు కూడా గెలుపోటములను నిర్ణయించే పరిస్థితి ఉండటంతో ప్రతీ ఓటుకోసం ప్రత్యక్షంగా ఓటర్లను కలుస్తున్నారు. ఉద్యోగస్తులు, విద్యార్థులు హైదరాబాద్‌, హనుమకొండలో ఉన్న వారితో మాట్లాడుతూ పోలింగ్‌ రోజూ తప్పకుండా వచ్చి ఓటేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. పలు వార్డుల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులను, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే వ్యక్తులను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement