ఇంటర్నల్‌ మార్కుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఇంటర్నల్‌ మార్కుల పరిశీలన

Feb 19 2026 10:00 AM | Updated on Feb 19 2026 10:00 AM

ఇంటర్

ఇంటర్నల్‌ మార్కుల పరిశీలన

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి

టేకుమట్ల: మండలంలోని గర్మిళ్లపల్లి, వెలిశాల ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి ఇంటర్నల్‌ మార్కులను వెరిఫికేషన్‌ టీం బుధవారం పరిశీలించింది. ఈ సందర్భంగా విద్యార్థుల రాత అంశాలకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాల్లోని రికార్డులు, వారి ప్రతిభను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వెరిఫికేషన్‌ టీం లీడర్‌ కొట్టె ప్రసాద్‌ విద్యార్థులకు మోటివేషన్‌ తరగతులను నిర్వహించి వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు అశోక్‌, ప్రకాష్‌, వరప్రసాద్‌, ఉపాధ్యాయులు రాము, గిరిబాబు, రాంచందర్‌, జగన్నాదం, రమేష్‌, మాదవీలత, రహీమా, మల్లయ్య, వెంకటేశ్వర్లు, నరేష్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

చిట్యాల: మండలంలోని జూకల్‌ ఉన్నత పాఠశాలకు చెందిన కౌటం అభిలాష్‌ రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబర్చి షాట్‌పుట్‌ విభాగంలో తృతీయ బహుమతి సాధించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన ప్రత్యేక అవసరాల గల పిల్లల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని తృతీయ బహుమతి సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు గిరగాని కృష్ణ తెలిపారు. దీంతో విద్యార్థిని సర్పంచ్‌ ఎలగోండ స్వప్న, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్‌ కోరుకోప్పుల కావ్య, ఉపాధ్యాయులు బుధవారం అభినందించారు.

‘ఎఫ్‌ఏఓను

సరెండర్‌ చేయాలి’

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇన్‌చార్జ్‌ ఫైనాన్స్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఏఓ) ఏ.మధుసూదన్‌ను సరెండర్‌ చేయాలని డీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన డీటీఎఫ్‌ జిల్లా కమిటీ అత్యవసర సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ జిల్లాలోని కేజీబీవీ ఎస్‌ఓలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. అలాంటి వ్యక్తిని జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో నాయకులు అశోక్‌, తిరుపతి, శ్రీనివాస్‌రెడ్డి, వీరేశం, ప్రభాకర్‌, రమణారెడ్డి సదానందంలు పాల్గొన్నారు.

గోవిందరావుపేట: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. మండల పరిధిలోని పస్రాలో గల సీపీఎం కార్యాలయంలో సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని ఎండీ గఫూర్‌ పాషా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో రైతులు 14 నెలల పాటు పెద్ద ఎత్తున నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే చర్యలను చేపట్టిందన్నారు. దేశీయ వ్యవసాయ ఉత్పత్తులు 500 బిలియన్‌ డాలర్ల విలువ చేసే రూ. 45 లక్షల కోట్ల విదేశీ వ్యవసాయ ఉత్పత్తులకు తలుపులు తెరిచి సుంకాలను తగ్గించారని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే చట్టాలకు రూపకల్పన చేశారని వివరించారు. వీటికి వ్యతిరేకంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఆందోళనలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, ఆ దిరెడ్డి, యాకుబ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్నల్‌ మార్కుల పరిశీలన1
1/2

ఇంటర్నల్‌ మార్కుల పరిశీలన

ఇంటర్నల్‌ మార్కుల పరిశీలన2
2/2

ఇంటర్నల్‌ మార్కుల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement