ఏటూరునాగారం: బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో బుధవారం బాలల భద్రత, సంరక్షణ, డ్రగ్స్ నిర్మూలన వారోత్సవాల కార్యక్రమాన్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ అధికారి హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ పౌరులందరికీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయన్నారు. బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గంటా మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనేక చోట్ల డబ్బులు పోగొట్టుకుని ఇ బ్బంది పడుతున్న విషయాలు చూస్తున్నామన్నా రు. అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. బాలికలు చిన్న చిన్న విషయాలకు ఆకర్షణకు గురవుతుంటారని వివరించారు. తల్లిదండ్రులు వారిపట్ల బాధ్యతగా ప్రేమతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


