వైభవంగా హనుమాన్‌ జయంతి | - | Sakshi
Sakshi News home page

వైభవంగా హనుమాన్‌ జయంతి

May 13 2026 1:20 AM | Updated on May 13 2026 1:20 AM

సాక్షి నెట్‌వర్క్‌: జిల్లావ్యాప్తంగా మంగళవారం హనుమాన్‌ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అభయాంజనేయ స్వామి ఆలయాల్లో అర్చకులు స్వామివారికి చందనం, తైలాభిషేకం, పంచాంమృతాలతో అభిషేకాలు, తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరించారు. వడపప్పు, బెల్లం పాయసం నైవేద్యాలుగా సమర్పించారు. కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన కట్ట మీద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. సాయంత్రం హనుమాన్‌ భక్తులు ద్విచక్ర వాహన ర్యాలీ, శోభాయాత్ర నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement