రేగొండ: మక్కలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం పరకాల–భూపాలపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలను విస్మరించారన్నారు. గన్నీ సంచులు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వరంగల్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్ రైతు సదస్సు కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అంకం రాజేందర్, హమీద్, కానుగంటి శ్రీనివాస్, కడారి జనార్ధన్, పాపిరెడ్డి, రజినికాంత్, నగేష్, గౌస్‌పాషా పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి


