పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

May 1 2026 5:57 AM | Updated on May 1 2026 5:57 AM

పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

భూపాలపల్లి: ఏఆర్‌ ఎస్‌ఐ అల్లం వేణుగోపాల్‌, జిల్లా పోలీసు కార్యాలయం జూనియర్‌ అసిస్టెంట్‌ బందెల కిష్టయ్యలను గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌, కిష్టయ్యలను అడిషనల్‌ ఎస్పీ నరేష్‌కుమార్‌ పూలమాల, శాలువాలతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ పోలీస్‌ శాఖలో 36 సంవత్సరాల పాటు నిబద్ధతతో, క్రమశిక్షణతో సేవలు అందించడం ప్రశంసనీయమని కొనియాడారు. వారి సేవలు శాఖకు ఆదర్శప్రాయమని తెలిపారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్‌ ఆర్‌ఐ రత్నం, ఎంటీఓ ఆర్‌ఐ పూర్ణచందర్‌, వెల్ఫేర్‌ ఆర్‌ఐ సంతోష్‌కుమార్‌, డీపీఓ ఏఓ ఫర్హాన, కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement