వ్యవసాయాన్ని పండుగ చేశాం | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయాన్ని పండుగ చేశాం

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి: వ్యవసాయాన్ని పండుగ చేసి అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. జిల్లాలో 30వేల ఎకరాలకు భూమి హక్కులు లేక రైతుల ఇబ్బందులు పడుతున్నారని, సర్వే నిర్వహించి అర్హులైన ప్రతీ ఒక్కరికి భూ హక్కు పట్టాలిస్తామని తెలిపారు. సాదాబైనామా భూములకు కూడా పట్టాలు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని సూచించారు. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం జిల్లాలో దిగ్విజయంగా జరుగుతుందని తెలిపారు. నేతన్న భద్రత బీమా కింద ఇద్దరికి రూ.10 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. దత్తత సహాయ కేంద్రం హెల్ప్‌డెస్క్‌ ప్రారంభించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్‌కుమార్‌, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, భూపాలపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కిష్టయ్య, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement