తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం

May 7 2026 8:02 AM | Updated on May 7 2026 8:02 AM

కల్టెర్‌ రాహుల్‌శర్మ

కాళేశ్వరం/భూపాలపల్లి రూరల్‌: తడిసిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. బుధవారం మహదేవపూర్‌ మండలం మహదేవపూర్‌, సూరారం గ్రామాలలో.. గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి, భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామాల్లో పర్యటించి కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వయంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు ఆందోళన చెందొద్దని, తడిసిన ధాన్యాన్ని తక్షణమే కాటారంలోని అన్నపూర్ణ పారా బాయిల్‌ రైస్‌ మిల్‌ తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, పౌర సరఫరాల అధికారి కిరణ్‌ కుమార్‌, ఎంపీడీఓ రవీందర్‌, పీఎసీఎస్‌ మాజీ చైర్మన్‌ తిరుపతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement