నేటితో స్వీయ జనగణన ముగింపు | - | Sakshi
Sakshi News home page

నేటితో స్వీయ జనగణన ముగింపు

May 10 2026 8:10 AM | Updated on May 10 2026 8:10 AM

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

భూపాలపల్లి: స్వీయ జనగణన నేటితో ముగుస్తుందని, ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. 2027 జనగణనలో భాగంగా ఆన్‌లైన్‌ ద్వారా స్వీయ గణన చేసుకునేందుకు నేటివరకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకునే ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. వెబ్‌సైట్‌ ద్వారా ఇంటి వద్ద నుంచే సులభంగా స్వీయ గణన నమోదు చేసుకోవాలన్నారు. మొబైల్‌ ఫోన్‌ ద్వారానే ఈ ప్రక్రియ పూర్తి సులభతరమని, నచ్చిన భాషను ఎంచుకొని వివరాలు నమోదు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు.

ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు..

రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. ధాన్యం కొనుగోలు, ఫార్మర్‌ రిజిస్ట్రీ, సెన్సస్‌, విద్యా వారోత్సవాలపై శనివారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలు, విద్యా, డీఆర్‌డీఓ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కు భూపాలపల్లి ఐడీఓసీ నుంచి కలెక్టర్‌తో పాటు డీసీఎస్‌ఓ కిరణ్‌కుమార్‌, డీఎం రాములు, డీఈఓ రాజేందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement