● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
చిట్యాల: ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని నైన్‌పాక గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల సామూహిక ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నందున పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశ్రీ, హౌసింగ్ డీఈ శ్రీకాంత్, ఏఈ సౌమ్య, సర్పంచ్ నక్క భాస్కర్, పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


