‘పది’ ఫలితాల్లో ‘ఎస్‌ఆర్‌’ విజయభేరి | - | Sakshi
Sakshi News home page

‘పది’ ఫలితాల్లో ‘ఎస్‌ఆర్‌’ విజయభేరి

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

విద్యారణ్యపురి: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఎస్‌ఆర్‌ స్కూల్స్‌ విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యా సంస్థల చైర్మన్‌ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి బుధవారం తెలి పారు. సి. సంస్కృతారెడ్డి 600 మార్కులకు 589, పిరంజి వంశీ 588, ఎస్‌.కీర్తన 587, అంకం సౌజన్య 587, ఎ. సంజయ్‌ 586, టి. వైష్ణవి 585, బాశెట్టి సాయిశ్రీ 584 మార్కులు సాధించారని వారు తెలి పారు. క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నామని, పాఠ్యప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందం విద్యాబోధన చేశారని వారు పేర్కొన్నారు. తమ విద్యార్థులు పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా ఐఐటీ అండ్‌ మెడికల్‌ ఫౌండేషన్‌లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా బృహత్తర పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైమ్‌స్కూళ్లను ప్రారంభించామని వారు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement