పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌

ములుగు రూరల్‌/గోవిందరావుపేట: పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం మండల పరిధిలోని మల్లంపల్లితో పాటు గోవిందరావుపేట మండల పరిధిలోని పస్రాలోని సోమలగడ్డ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా నుంచి ఎట్టి పరిస్థితుల్లో పశువుల అక్రమ రవాణా జరగకూడదని, ఎవరైనా నిబంధనలకు ఉల్లంఘించి పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెక్‌ పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది షిఫ్టుల వారీగా విధులు నిర్వహించాలన్నారు. విధుల్లో అలసత్వం వహించొద్దని హెచ్చరించారు. పశువులు రవాణా చేసే వ్యక్తుల వద్ద సరైన పత్రాలు ఉన్నాయా లేదా పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement