నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణం | - | Sakshi
Sakshi News home page

నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణం

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి ఆర్థిక నష్టాలకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాల విధానాలే కారణమని సింగరేణి కోల్‌ మైన్స్‌ కార్మిక సంఘ్‌ (బీఎంఎస్‌) ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి, కార్యనిర్వహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాసులు అన్నారు. ఏరియాలోని కేటీకే–5గనిలో శుక్రవారం నిర్వహించిన గేట్‌ మిటింగ్‌ అనంతరం బీఎంఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు చెప్పి ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలు కార్మికులను మోసం చేశాయన్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలు సింగరేణికి చెల్లించాల్సిన రూ.51 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మెడికల్‌ బోర్డు నిర్వహణ, డిపెండెంట్‌ ఉద్యోగాలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, కార్మికుల గృహ కల అమలు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వెలబోయిన సుజేందర్‌, సత్కూరి శ్రీనివాస్‌, పునీత్‌ రావు, చిట్యాల ప్రవీణ్‌, రాజు నాయక్‌, దేవర సమ్మయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement