ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

భూపాలపల్లి అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక విద్యా వారోత్సవాల వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు సర్పంచులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కలెక్టర్‌ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ బలోపేతానికి వారోత్సవాల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, డీఆర్‌ఓ వసంతకుమారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజబాబు, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, డీఈఓ రాజేందర్‌ పాల్గొన్నారు.

రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు

తాలు, తడక పేరుతో రైతులను దోపిడీ చేస్తే సహించబోమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రైస్‌ మిల్లర్లను హెచ్చరించారు. కలెక్టరేట్‌లో ఽకలెక్టర్‌ రాహుల్‌శర్మతో కలిసి సమావేశం నిర్వహించారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement
 
Advertisement
Advertisement