ఆలకించండి! | - | Sakshi
Sakshi News home page

ఆలకించండి!

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

సాక్షి వేసవికాసం

– వివరాలు 8లోu

న్యూస్‌రీల్‌

జయశంకర్‌ భూపాలపల్లి
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026

పిల్లలకు పాఠశాలలు ముగిశాయి. వేసవి సెలవులంటే పిల్లలకు ఎంతో ఇష్టం. అమ్మమ్మ, నానమ్మ ఇంటికి వెళ్లడం, వారు చెప్పే నీతి కథలు, ఆటవిడుపుగా బొమ్మలు గీయడం, స్నేహితులతో ఈత నేర్చుకోవడం, ఆటపాటల్లో మునిగితేలుతుంటారు. ఇలాంటి అనుభవాలకు వేదికగా సాక్షి నిలుస్తోంది. సెలవుల్లో పిల్లల సందడిపై నేటినుంచి వేస‘వి’కాసం అందిస్తోంది.

మంత్రివర్యా

మీరైనా

భూపాలపల్లి అర్బన్‌: ప్రాథమిక విద్య, ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) తరగతులు ప్రారంభించేందుకు 2025 –26వ విద్యాసంవత్సరానికి గతేడాది జూలైలో ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకానికి ఆదేశాలు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటివరకూ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలు అమలు కాలేదు. అందుకు సంబంధించిన టీచర్లు, ఆయాలను నియమించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ వచ్చే విద్యా సంవత్సరంలోనైనా నియామకాలు చేపట్టి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తారని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దృష్టి సారించాలని కోరుతున్నారు.

గతేడాది జిల్లాలో 55 పాఠశాలల ఎంపిక

జిల్లాలోని 12 మండలాల పరిధిలో 55 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసి ఆ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. చిన్నారులకు చదువు చెప్పేందుకు ఒక్కో పాఠశాలకు ఒక్కో టీచర్‌తో పాటు పిల్లల కనీస అవసరాలు తీర్చేందుకు ఆయాను నియమించాలని ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 55 మంది టీచర్లు, 55 మంది ఆయాలను నియమించాలని ఉన్నతాధికారులు భావించారు. జిల్లాలో 55 పాఠశాలల్లో 2025 – 26వ విద్యా సంవత్సరానికి టీచర్లు, ఆయాలను తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకు గతేడాది ఆగస్టు 22వ తేదీన దరఖాస్తుల స్వీకరణకు జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి నోటిఫికేషన్‌ జారీచేశారు. 28వ తేదీలోపు దరఖాస్తులను స్వీకరించారు.

ఈసారి విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వ ఆదేశాలు జిల్లాలో గత విద్యా సంవత్సరంలో అమలుకాకపోవడంతో ఈవిద్యా సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ లేకపోవడంతో నేరుగా అంగన్‌వాడీల నుంచి ప్రైవేట్‌ పాఠశాలలకు తమ పిల్లలను తల్లిదండ్రులు పంపిస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో ప్రీ ప్రైమరీ ప్రారంభిస్తారని విద్యార్థుల ప్రవేశాలు చేపట్టి ప్రీప్రైమరీ ప్రారంభించకపోవడంతో నూతన అడ్మిషన్ల పెంపుపై ఈసారి ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా వేసవి సెలవులకు ముందే నియామకాల ప్రక్రియను ప్రారంభిస్తే ప్రతీ పాఠశాలలో కనీసం 10 నుంచి 20 మంది వరకు చిన్నారులు చేరే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.

రాజకీయ జోక్యం

ప్రీప్రైమరీ టీచర్లు, ఆయాల ఎంపికకు విద్యార్హత, స్థానికత, వయస్సు సంబంధిత అర్హతలుగా నిర్ధారించారు. కాగా, ఆయా పాఠశాలల్లో తాము సిఫార్సు చేసిన వ్యక్తులను మాత్రమే నియమించాలని అధికార పార్టీకి చెందిన నాయకులు.. విద్యాశాఖ అధికారులకు సూచించినట్లు తెలిసింది. తమ వారికి, పార్టీకి చెందిన వారికే అవకాశాలు కల్పించాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దాంతో ఎంపిక ప్రక్రియపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకాలకు

గతేడాది నోటిఫికేషన్‌ విడుదల

జిల్లాలో నేటికీ చేపట్టని ఎంపిక ప్రక్రియ

కలెక్టర్‌ వద్ద పెండింగ్‌లో ఫైల్‌?

మరో నెలరోజుల్లో పాఠశాలలు

పునఃప్రారంభం

ఎవరిదీ నిర్లక్ష్యం?

రాష్ట్రంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మినహా ఇతర జిల్లాల్లో గతేడాది నుంచే ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించారు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే పలు జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు.. టీచర్లు, ఆయాల నియామకాల ప్రక్రియను చేట్టారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మాత్రం ఇప్పటివరకు పూర్తి చేయలేదు. విద్యాశాఖ అధికారులు తయారు చేసిన టీచర్లు, ఆయాల ఎంపిక జాబితా పారదర్శకంగా లేకపోవడంతో దాన్ని సవరించాలని ఆదేశించినట్లు తెలిసింది. రెండో జాబితాను తయారు చేసి కలెక్టర్‌ వద్దకు మళ్లీ పంపించినట్లు సమాచారం. జిల్లాలో నియామకాల జాబితా తయారీలో నిర్లక్ష్యంతో ప్రక్రియ ఆలస్యమవుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సైతం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement