భూపాలపల్లి రూరల్: ప్రభుత్వం అందిస్తున్న సౌర విద్యుత్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా భూపాలపల్లి మండలం కొంపల్లి రైతు వేదికలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు వ్యవసాయ వినియోగం కోసం సౌర విద్యుత్‌పై దృశ్య–శ్రవణ ప్రదర్శన, వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్లు, సౌర ఆధారిత సాగునీటి పద్ధతుల ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి సతీష్, కొంపల్లి సర్పంచ్ సడల శ్రీకాంత్, కొంపల్లి తండా సర్పంచ్ నిర్మల, గూడాడ్‌పల్లి సర్పంచ్ దారురి శారద, భూపాలపల్లి సహాయ వ్యవసాయ సంచాలకుడు రమేష్, విద్యుత్ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.


