స్వీయ జనగణనలో పాల్గొనాలి | - | Sakshi
Sakshi News home page

స్వీయ జనగణనలో పాల్గొనాలి

May 9 2026 8:02 AM | Updated on May 9 2026 8:02 AM

భూపాలపల్లి: స్వీయ జనగణన కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ చురుకుగా పాల్గొనాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ పిలుపునిచ్చారు. ఆన్‌లైన్‌ ద్వారా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉన్నందున, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు స్వీయ జనగణన వెబ్‌సైట్‌ ద్వారా ఇంటి వద్ద నుంచే మొబైల్‌ ఫోన్‌ సహాయంతో సులభంగా స్వీయ గణన పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. నచ్చిన భాషను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. గత నెల 26వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 10తో ముగుస్తుందన్నారు. అనంతరం ఈ నెల 11వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి హౌస్‌ లిస్టింగ్‌ నిర్వహిస్తారని వివరించారు. దేశ ప్రణాళిక, భవిష్యత్‌ అభివృద్ధి, వనరుల సమాన పంపిణీకి జనగణన కీలకమన్నారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు కూడా తమ ప్రస్తుత నివాసం నుంచే వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. కుటుంబ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, అవి కేవలం జనాభా లెక్కల కోసమే వినియోగించబడతాయని స్పష్టం చేశారు. ప్రతీ కుటుంబానికి ప్రత్యేక ఎన్యుమరేషన్‌ ఐడీ ఇవ్వబడుతుందని, దీని ద్వారా ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని తెలిపారు. జిల్లా ప్రజలందరూ స్వీయ జనగణనలో పాల్గొని జిల్లా, దేశ అభివృద్ధికి సహకరించాలని ఆకాంక్షించారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

రేగొండ: మక్కలు, ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. మండలంలోని లింగాల రైస్‌మిల్‌, రూపిరెడ్డిపల్లిలోని సహకార సంఘం భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించడానికి లారీలను అందుబాటులో ఉంచాలన్నారు. రైస్‌మిల్‌, సహకార సంఘం భవనంలో ధాన్యాన్ని నిల్వ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌, డీఎం రాములు, సహకార జిల్లా అధికారి వాలియ నాయక్‌, తహసీల్దార్‌ శ్వేత, డిప్యూటీ తహసీల్దార్‌ అబ్దుల్‌ రజాక్‌ పాల్గొన్నారు.

ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి

చిట్యాల: మండలంలోని వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులకు ఆదేశించారు. మండలంలోని దూత్‌పల్లిలో వరి ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని, మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలోని మొక్కజొన్న, వరి ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ తేమశాతం వచ్చిన ధాన్యన్ని వెంటవెంటనే లారీలపైన ఆధారపడకుండా ట్రాక్టర్‌ల ద్వారా కూడా మిల్లులకు తరలించాలని అధికారులకు ఆదేశించారు.

మొగుళ్లపల్లి: మండల కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ గిడ్డంగి ని కలెక్టర్‌ రాహుల్‌శర్మ పరిశీలించి నిల్వల వివరా లు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, డీఎస్‌ఓ కిరణకుమార్‌, డీసీఓ వాల్యానాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, మార్క్‌ఫెడ్‌ అధికారి శ్రీలత, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ గుమ్మడి శ్రీదేవి పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement
 
Advertisement
Advertisement