నేడు హనుమకొండలో మెగా జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

నేడు హనుమకొండలో మెగా జాబ్‌మేళా

May 8 2026 12:19 PM | Updated on May 8 2026 12:19 PM

భూపాలపల్లి అర్బన్‌: టాస్క్‌, డీఈఎఫ్‌టీ సంయుక్తంగా హనుమకొండలో నేడు(శుక్రవారం) మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి రఘు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఈ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. జిల్లాలోని ప్రముఖ పరిశ్రమలతో పాటు హైదరాబాద్‌కు చెందిన పలు ఐటీ కంపెనీలు, సేవారంగ సంస్థలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులకు ఎంపికై న వెంటనే నియామక పత్రాలు అందజేయనున్నట్లు వివరించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తుల పరిశీలన

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి పురపాలక సంఘ కార్యాలయ పరిధిలో ఎస్సీ కార్పొరేషన్‌ రుణ దరఖాస్తుదారుల పరిశీలన ప్రక్రియ గురువారం పూర్తి చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ తెలిపారు. సంబంధిత బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించారు. అర్బన్‌ పరిధిలో మొత్తం 114 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఇందిరా, మెప్మా విభాగపు అధికారి రాజేశ్వరి పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాల

సందర్శన

చిట్యాల: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఉన్న మొక్క జొన్న, వరి ధాన్యాన్ని డీసీఓ వాల్యూనాయక్‌ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు నిర్వాహకులు, రైతులతో మాట్లాడారు. రైతులు ఆందోళన చెందవద్దని ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫైడ్‌ అధికారి శ్రీదేవి, చిట్యాల వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ గుమ్మడి శ్రీదేవి, అసిస్టెంట్‌ రిజిస్టర్‌ రాజు, చిట్యాల సీఈఓ మొగిలి, సెంటర్‌ ఇన్‌చార్జ్‌, రైతులు పాల్గొన్నారు.

వన్యప్రాణులను

రక్షించుకోవాలి

మల్హర్‌(కాటారం): వన్యప్రాణుల రక్షణకు ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కాటారం రేంజ్‌ అధికారి స్వాతి అన్నారు. గురువారం మండలంలోని బొప్పారం, ప్రతాపగిరి గ్రామాల్లో రేంజర్‌ స్వాతి, సిబ్బందితో కలిసి వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడినా, హాని కలిగించినా, హతమార్చేందుకు ఉచ్చులు బిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవువుల్లో అగ్ని ప్రమాదాలు జరకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓలు హెచ్‌.సురేందర్‌, జె.శ్రీనివాస్‌, ఎఫ్‌ఎస్‌ఓలు పి.చంద్రశేఖర్‌, బీట్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అనుమానం వస్తే

సమాచారం ఇవ్వండి

కాళేశ్వరం: లాడ్జిల్లోకి అనుమానాస్పద వ్యక్తులు వచ్చినా, అనుమానం వచ్చిన వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని లాడ్జ్‌ నిర్వాహకులను కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆదేశించారు. గురువారం కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లాడ్జ్‌ యజమానులతో డీఎస్పీ సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. నిర్వాహకులు కస్టమర్ల పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఏ పని నిమిత్తం వచ్చారో కూడా తెలుసుకోవాలని సూచించారు. లాడ్జ్‌లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని.. రిజిస్టర్‌, సీసీ కెమెరా పుటేజీలను అవసరమైనప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. నియమాలు పాటించని యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మహదేవపూర్‌ సీఐ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement