రేపటి నుంచి అథ్లెటిక్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి అథ్లెటిక్‌ పోటీలు

May 5 2026 7:08 AM | Updated on May 5 2026 7:08 AM

భూపాలపల్లి రూరల్‌: ఈనెల 6వతేదీ బుధవారం నుంచి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ స్టేడియంలో నిర్వహించనున్న అథ్లెటిక్‌ పోటీల్లో జిల్లాలోని క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అథ్లెటిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొనేవారు బుధవారం ఉదయం ఆరు గంటలకు జనన ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. సబ్‌ జూనియర్‌, జూనియర్స్‌, సీ్త్రలు, పురుషుల విభాగాలలో క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 10వ తేదీన హనుమకొండలో జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement