మొగుళ్లపల్లి : మండలంలోని వివిధ గ్రామాల బాలికలకు ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం సైబర్ క్రైమ్, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జి.మల్లేశ్వరి హాజరై మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులన్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని స్కిల్ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలను అభ్యసించాలని, తల్లిదండ్రులకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచేలా మంచి భవిష్యత్ నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్, ఎస్సై సురేష్, ఏపీఎం రమాదేవి, మెడికల్ ఆఫీసర్ నవత, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డి నేటర్ గుర్రం తిరుపతి, సఖి కౌన్సిల ర్ మాధవి, అనూష, మమత, కళావ తి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.


