దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో మరోసారి విజయదుందుభి మోగించారు. 582 మార్కులతో బాకి అభిజ్ఞాన్ దేవరుప్పుల మండలంలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మహ్మద్ రైసున్నీసా 576, కున్సోతు స్వాతి 566 మార్కులు, మొత్తం 32 మంది విద్యార్థుల్లో 22 మంది 500కు పైగా మార్కులు సాధించారని, ఇది ఎంతో గర్వకారణమని పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు మదన్ మోహన్, మహేశ్, కృష్ణ, పాషా, షబానా, సంధ్య.. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.


