తప్పులు లేకుండా సర్వే పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

తప్పులు లేకుండా సర్వే పూర్తిచేయాలి

May 13 2026 1:14 AM | Updated on May 13 2026 1:14 AM

ములుగు: మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఇళ్ల గణనలో తప్పులు లేకుండా సర్వే పూర్తి చేయాలని ఎన్యుమరేటర్లకు రాష్ట్ర సెన్సెస్‌ ఆపరేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సుబ్బరాజు సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మున్సిపాలిటీలోని సూపర్‌వైజర్‌ సర్కిల్‌లో సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లు ఇంటి నంబర్లను ఎలా కేటాయిస్తున్నారో, పని సక్రమంగా జరుగుతుందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతీ ఇంటి నంబర్‌ ఎదురుగా శ్రీసీఎన్‌శ్రీ అని తప్పనిసరిగా రాయాలని సూచించారు. మ్యాపింగ్‌ ఎలా చేస్తున్నారో కూడా ఆయన ఆరా తీశారు. సర్వేలో వేగం పెంచాలని తెలిపారు. ఎన్యుమరేటర్లకు కేటాయించిన హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌ హెచ్‌ఎల్‌బీ పరిధిని స్పష్టంగా తెలియజేసేందుకు మున్సిపాలిటీ నుంచి మూడు రోజుల పాటు సిబ్బందిని వారి వెంట పంపించాలని ఆదేశించారు. జిల్లాలోని ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు బుధవారం సాయంత్రంలోపు తమకు కేటాయించిన ప్రతీ ఇంటికి ఇంటి నంబర్లు వేయడం పూర్తి చేయాలని సూచించారు. వచ్చే నెల 9వ తేదీ వరకు సర్వే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. రోజువారీ పనితీరుపై మానిటరింగ్‌ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెన్సెస్‌ ఇన్‌చార్జ్‌ వినయ్‌, ములుగు సీపీవో, జిల్లా సెన్సెస్‌ అధికారి ఎం.ప్రకాశ్‌, మున్సిపాలిటీ చార్జ్‌ ఆఫీసర్‌ కమిషనర్‌ సంపత్‌, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ బి.లాల్‌నాయక్‌, ఫీల్డ్‌ ట్రైనర్లు, సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.

సీఎం చేతుల మీదుగా నగదు ప్రోత్సాహం

మల్హర్‌: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో 2025–26 విద్యా సంవత్స రం ఇంటర్మీడియట్‌లో రాష్ట్రంలోనే ఉత్తమ ఫలి తాలు సాధించింది. ఈ మేరకు ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా తాడిచర్ల జూనియర్‌ కళా శాల ప్రిన్సిపాల్‌ విజయదేవి రూ.1లక్ష చెక్కు ను అందుకున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రిన్సిపాల్‌ను కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

వెంకటాపురం(కె): ఏజెన్సీలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పొ అన్నారు. పీఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీఓ తొలిసారిగా మంగళవారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండల పరిధిలోని చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 1, చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 2ను తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పాఠశాల పునఃప్రారంభం నాటికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించి రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు.

ఆస్తి కోసం వృద్ధురాలి హత్య..

గణపురం : మండలంలోని గొల్లపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి, డబ్బు కోసం నానమ్మను మనువడు, అతడి భార్య హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గణపురం సీఐ కరుణాకర్‌ రావు కథనం ప్రకారం.. గొల్లపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల ఐలమ్మ (60)ను ఆస్తి, రూ.40 వేల కోసం ఆమె మనువడు జాకేందర్‌, అతడి భార్య అమకృతి ఈనెల 09న ప్రణాళిక ప్రకారం కర్రతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఇందులో తామే హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కరుణాకర్‌రావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement