భూపాలపల్లి అర్బన్: గంజాయి సరఫరా, వినియోగాన్ని అరికట్టడంపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు శనివారం ఆపరేషన్ ఆర్‌ఐ కాశీరాం ఆధ్వర్యంలో ఈగల్ టీం సిబ్బంది నార్కోటిక్ డాగ్ సహాయంతో పాన్‌షాప్‌లు, కిరాణా దుకాణాలు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలను ఎవరైనా నిల్వ ఉంచినా లేదా విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు.


