కోర్టు ఏర్పాటుకు భవనాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

కోర్టు ఏర్పాటుకు భవనాల పరిశీలన

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

మల్హర్‌(కాటారం): మండలంలోని కాటారంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి జ్యూడిషినల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు స్థాపనకు సంబంధించి జిల్లా ఇన్‌చార్జ్‌ ప్రధాన న్యాయమూర్తి సూర్య చంద్రకళ స్థానిక న్యాయవాదులతో కలిసి శుక్రవారం పలు భవనాలను సందర్శించారు. ఈ సందర్భంగా కోర్టు నిర్వహణకు అనుకూలమైన వసతులు, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు వంటి అంశాలను జడ్డి పరిశీలించారు. త్వరలోనే కాటారంలో జూనియర్‌ సివిల్‌ కోర్టు ఏర్పాటుతో ప్రజలకు మరింత మెరుగైన న్యాయ సేవలు అందుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు రంజిత్‌ కుమార్‌, ఆరేళ్లి వెంకట స్వామి, రేపాల సంతోష్‌, ఇందారపు శివకుమార్‌, వల శ్రవణ్‌రావు, ఆకుల రాములు, మెషినేని శ్రీనివాస్‌రావు, అబ్దుల్‌ కలాం, సతీష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement