హసన్‌పర్తి: టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఏకశిల విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వరుసగా 585,582,580,578
,577,576,574,573,572,571,570 మార్కులతో రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచినట్లు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా హసన్‌పర్తి మండలం పెంబర్తిలోని ఏకశిల టెక్నో స్కూల్‌లో బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకశిల విద్యాసంస్థలో విద్య అంటే మార్కులు మాత్రమే కాదు.. భవిష్యత్‌ను నిర్మించే శక్తి అన్నారు. నాణ్యమైన విద్యతోపాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలతో ఏకశిల విద్యాసంస్థకు మరింత గౌరవం పెరిగిందన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్లు బేతి కొండల్‌రెడ్డి, గౌరు సువిజారెడ్డి, ప్రిన్సిపాళ్లు బేతి శైలజారెడ్డి, ముచ్చ స్వప్నరెడ్డి, ఎం.డి. బాబా, కె.డి. స్వర్ణరాజ్, లవకుమార్, అడ్మినిస్ట్రేషన్ ఇన్‌చార్జ్ జి.రాంప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


