మేడారంలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

మేడారంలో భక్తుల సందడి

May 11 2026 7:26 AM | Updated on May 11 2026 7:26 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేల సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద షెవర్‌ కింద స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దేవాదాయశాఖ జూనియర్‌ అసిస్టెంట్లు జగదీశ్వర్‌, మధు, రామదేవి సేవలందించారు.

Advertisement
 
Advertisement
Advertisement