పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

May 13 2026 1:14 AM | Updated on May 13 2026 1:14 AM

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఎస్పీ సంకీర్త్‌ సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. జి ల్లాలో పోలీస్‌ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్‌ కోర్టును ప్రారంభించారు. స్టేషన్‌ పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణను ఎస్పీ పరిశీలించారు. స్టేషన్‌లో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్‌ కేసుల పరిష్కారంపై అధికారులతో సమీక్ష ని ర్వహించారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే వి ధంగా సేవలు అందించాలని సిబ్బందికి సూచించా రు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ సంపత్‌రావు, సీఐ నరేష్‌కుమార్‌, ఎస్సై సాంబమూర్తి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement