భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో ఈ నెల 24న నిర్వహించునున్న సీపీఎం, సీఐటీయూ నాయకుడు కంపేటి రాజయ్య సంతాప సభను విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మంద నరసింహారావు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభకు సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సీఐటీయూ కార్యాయలంలో జిల్లా అధ్యక్షుడు సాయిలు అధ్యక్షతన నిర్వహించగా వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కంపేటి రాజయ్య కార్మిక, ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన నాయకుడని కొనియాడారు. నాయకులు గుర్రం దేవేందర్, సిహెచ్ రవికుమార్, మేకల మహేందర్, కొండ లక్ష్మి, విజయలక్ష్మి, బండారి బాబు, తోట రమేష్ పాల్గొన్నారు.


