● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: తహసీల్దార్లు, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా.. లారీలు సమయానికి అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో లారీలు అందుబాటులో ఉండటం లేదని.. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సహకార, డీఆర్‌డీఓలు పరిశీలించాల్సి ఉన్నా పర్యవేక్షణ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొనుగోలుపై ప్రతి రోజు నివేదికలు ఇవ్వాలని డీఎంను ఆదేశించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్, డీఎం రాములు, రవాణా అధికారి సంధాని, సహకార అధికారి వాలియానాయక్, డీఆర్‌డీఓ బాలకృష్ణ, వ్యవసాయ అధికారి బాబూరావు, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్లు, రైస్ మిల్లర్లు, ట్రాస్పోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి
పెండింగ్‌లో ఉన్న భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తహసీల్దార్లను ఆదేశించారు. భూ భారతిలో అందిన ప్రతీ దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ బాలకృష్ణ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఏడీ కుసుమ కుమారి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి
పెండింగ్ ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగం పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, హౌసింగ్ ఏఈ శ్రీకాంత్, ఎంపీడీఓలు, హాసింగ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


