హెవీ డ్రైవింగ్‌ ధ్రువపత్రాల అందజేత | - | Sakshi
Sakshi News home page

హెవీ డ్రైవింగ్‌ ధ్రువపత్రాల అందజేత

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

భూపాలపల్లి అర్బన్‌: హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణ పూర్తిచేసిన మహిళా ఉద్యోగులకు జీఎం కార్యాలయంలో భూపాలపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం ధ్రువపత్రాలను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని టైడ్స్‌ సంస్థలో నిర్వహించిన 30రోజుల శిక్షణలో కంపెనీ వ్యాప్తంగా ఎంపికై న 13 మంది పాల్గొనగా, భూపాలపల్లి ఏరియా నుంచి రేణుక, రమ్యశ్రీ, భార్గవి, అనూష హాజరై విజయవంతంగా శిక్షణను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీఎం రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు సాంకేతిక రంగాల్లో రాణించడానికి ఇలాంటి శిక్షణలు దోహదపడతాయని తెలిపారు. శిక్షణ పొందిన వారికి భవిష్యత్‌లో డంపర్‌, మోటార్‌ ఆపరేటర్‌ వంటి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్మిక సంఘ ప్రతినిధులు కవీంద్ర, రవీందర్‌, శ్యామ్‌సుందర్‌, మధుకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement