ఎరువుల భారం.. | - | Sakshi
Sakshi News home page

ఎరువుల భారం..

May 2 2026 7:44 AM | Updated on May 2 2026 7:44 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026

ఈ ఏడాది నాలుగుసార్లు పెంపు

రైతన్నలపై అదనపు భారం

కల్యాణం.. కమనీయం

రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతీ నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. శుక్రవారం అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్‌, సుధాకర్‌, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన

న్యాయమూర్తికి సన్మానం

భూపాలపల్లి అర్బన్‌: 23 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌ రమేశ్‌బాబు శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా భూపాలపల్లి బార్‌ అసోసియేషన్‌, కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి పలువురు న్యాయమూర్తులు హాజరై రమేశ్‌బాబు సేవలను, వారి ఆదర్శప్రాయ జీవితాన్ని కొనియాడారు. విశ్రాంత జీవితంలో కూడా సమాజ సేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్జి సతీమణి అనంతలక్ష్మి, ములుగు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్యచంద్ర, వరంగల్‌ ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మల గీతాంబ, వరంగల్‌ మొదటి అదనపు జిల్లా జడ్జి జె.మైత్రేయి, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.కన్హయ్యలాల్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌ఆర్‌ దిలీప్‌ కుమార్‌నాయక్‌, గవర్నమెంట్‌ ప్లీడర్‌ బొట్ల సుధాకర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కూనూరు సురేష్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు పాల్గొన్నారు.

బుద్ధుడి బోధనలు ఆదర్శం

మల్హర్‌(కాటారం): బుద్ధుడి బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శమని టీపీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్‌ అన్నారు. గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా శుక్రవారం మండలంలోని కాటారం గారేపల్లిలోని జై భీమ్‌ అంబేడ్కర్‌ కార్యాలయంలో బుద్ధుడు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పీక కిరణ్‌ మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడు ధర్మాన్ని సత్యాన్ని న్యాయాన్ని ప్రేమను అందించి ఆచరించి ప్రపంచ మానవాళికి ఆదర్శనీయులయ్యారని చెప్పారు. ప్రతీఒక్కరు బుద్ధుడి బోధనల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు సంపత్‌ మహారాజు. యువైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్‌. కొండన్న. తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

భూపాలపల్లి అర్బన్‌: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్‌ రాహుల్‌శర్మకు వినతిపత్రం అందజేసినట్లు జేఏసీ జిల్లా చైర్మన్‌ బురుగు రవి తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఈ నెల 5న కలెక్టరేట్‌ ఎదుట సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ముందు ఉంచిన నాలుగు కీలక డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు విజయలక్ష్మి, సుభాకర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌, సేవానాయక్‌, తిరుపతి, రామయ్య, శ్రీనివాసులు, దశరథం, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

భూపాలపల్లి రూరల్‌: ఆరుగాలం శ్రమించి పంటలు పండించి అందరి ఆకలి తీర్చే రైతన్నపై ఎరువుల ధరల పిడుగు ఏటా పడుతూనే ఉంది. ఈ ఏడాది కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను ఆయా కంపెనీలు నాలుగు సార్లు పెంచడంతో వచ్చే వానాకాలంలో పంటల సాగు మరింత భారం కానుంది. గత వానాకాలం సీజన్‌లో బస్తాకు రూ.50.. ఈ యాసంగి సీజన్‌లో బస్తాకు రూ.50 చొప్పున రెండుసార్లు కలిపి రూ.100 పెంచారు. తాజాగా నాలుగోసారి బస్తాకు రూ.225 నుంచి రూ.300 పెంచడంతో రానున్న సీజన్‌లో రైతులపై ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం పడనుంది. కాంప్లెక్స్‌ ఎరువులు జిల్లాలో సుమారుగా 96 మెట్రిక్‌ టన్నులు వినియోగిస్తారని వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

రైతులపై భారం..

గ్రామాలలో పశు సంపద తగ్గిపోవడం సేంద్రియ ఎరువులు లేకపోవడంతో పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతుంది. జిల్లాలో వానాకాలం సాధారణ సాగు 2లక్షల ఎకరాలు ఉండగా సుమారుగా 98వేల మంది వరకు రైతులు ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, జొన్న, ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు. రెండు సీజన్‌లకు కలిపి లక్షా 40వేల టన్నుల ఎరువులు ఉపయోగించనున్నారు. దీని ప్రకారం రైతులపై కోట్లలో భారం పడనుంది.

పెరిగిన ధరలతో రైతులకు కష్టం..

పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతుంది. జిల్లాలో వానాకాలం సాధారణ సాగు రెండు లక్షల ఎకరాలు ఉండగా సుమారుగా 98వేల మంది రైతులు ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, జొన్న, ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం కూరగాయలు, ఇతర పంటలు సాగుచేసే రైతులు కాంప్లెక్స్‌ ఎరువుల కోసం వెళ్తే పెరిగిన ధరల బస్తాలు మాత్రమే విక్రయిస్తుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కంపెనీలు డీఏపీ, యూరియా మినహా అన్ని రకాల కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను పెంచడంతో ఈసారి కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెంచినట్లు సమాచారం ఉందని ఫర్టిలైజర్‌ షాపుల యాజమానులు చెబుతున్నారు.

ఏటా పెరుగుతున్న కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు

రైతులపైనే భారం..

ధరలతో రైతులపై అదనపు భారం పడుతుంది. ఈ ఏడాది ఏకంగా నాలుగు సార్లు ధరలు పెంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పుల కారణంగా సరైన దిగుబడులు రాక పెట్టుబడులు మీద పడుతున్నాయి. ప్రభుత్వం కంపెనీలతో మాట్లాడి పెంచిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు తగ్గించేందుకు కృషిచేయాలి. ధరలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలి.

– రాపాల రాజయ్య ,

రైతు, కొత్తపల్లి (ఎస్‌ఎం), భూపాలపల్లి

మద్దతు ధర పెంచాలి..

ఎరువులు తయారు చేసే కంపెనీలు ఏదో సాకుతో ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తున్నాయి. కానీ రైతులు పండించిన పంటకు మాత్రం ధర అడిగే హక్కు లేదా? కంపెనీల జోలికి వెళ్లని ప్రభుత్వం రైతులపై ప్రతాపం చూపి వారు నిర్ణయించిన ధరలకే పంటను అమ్మి నిలువునా మోసపోతున్నాం. రైతులు పండించిన ధాన్యానికి కూడా మద్దతు ధర పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– ఎలవేని నర్సయ్య , రైతు, టేకుమట్ల

ఘనంగా మేడే

మేడే వేడుకలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం కార్మికులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏరియాలోని యూనియన్‌ కార్యాలయాలు, బొగ్గు గనులు, ప్రధాన కూడళ్ల వద్ద సంఘాల నాయకులు జెండాలు ఎగరవేశారు.

– భూపాలపల్లి అర్బన్‌

ఎరువు పాత కొత్త పెంపు

(50కిలోలు బస్తా) ధర ధర

19–19–19 2.075 2,300 225

20–20–13 1,500 1,800 300

14–35–14 2,175 2,250 75

12–32–15 2.025 2,250 225

పొటాష్‌ 1.850 1.975 125

16–16–16 1,675 2,050 375

24–24–0 2,000 2,300 300

10–23–26 1,950 2,025 75

15–15–15–09 1,650 1,950 300

14–35–14 2,150 2,350 200

16–20–13 1,400 1,750 350

రేపు మధ్యాహ్నం 2నుంచి 5 గంటల వరకు నిర్వహణ

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో

14 పరీక్ష కేంద్రాలు

ఉదయం 11గంటల నుంచే

సెంటర్లలోకి అనుమతి

మధ్యాహ్నం 1–30గంటల తరువాత

నో ఎంట్రీ

హాజరుకానున్న 6,016మంది

అభ్యర్థులు

Advertisement
 
Advertisement
Advertisement