భూపాలపల్లి రూరల్: జిల్లాలోని అనాథ, పాక్షిక అనాథ బాలికలకు దుర్గాబాయి దేశ్‌ముఖ్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదవ తరగతి పూర్తిచేసిన అర్హత కలిగిన బాలికలు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారాన్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం, బాల రక్షా భవన్ కలెక్టరేట్‌లో అందజేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 99481 52061 ఫోన్‌నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
మోటార్ బిగించారు
మల్హర్: ఈనెల 14న సాక్షిలో ప్రచురితమైన పొలాల నుంచి తాగునీరు కథనానికి అధికారులు స్పందించారు. మండలంలోని అన్సాన్‌పల్లి గ్రామంలోని ఒకటో వార్డులో బోరు మోటార్ చెడిపోగా.. శుక్రవారం బోరు మోటరు బిగించారు. అధికారులు, పంచాయతీ పాలక వర్గం సభ్యులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించారు.
ప్రవేశాలకు
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతాపూర్)లో ఒకటవ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి ఇందిరా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకు ఒక సీటు కేటాయించారని, దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జూన్ 1నుంచి 2019 నుంచి మే 1, 2020 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు..
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం పథకం కింది 1వ తరగతి, 5వ తరగతిలో ప్రవేశం కోసం జూన్ 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి ఇందిర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 1వ తరగతికి (41) సీట్లు, 5వ తరగతికి (43) సీట్లు కేటాయించినట్లు తెలిపారు.
31వరకు రెడ్ క్రాస్
సభ్యత్వ నమోదు
భూపాలపల్లి అర్బన్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు భూపాలపల్లి రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ కాశిట్టి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా మార్గదర్శకత్వంలో, రాష్ట్ర చైర్మన్ దాన కిషోర్ నాయకత్వంలో రెడ్ క్రాస్ సంస్థ సేవలు అందిస్తుందన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో జిల్లాలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ భారతీయ పౌరుడు జీవిత, వైస్ ప్యాట్రన్, ప్యాట్రన్ సభ్యులుగా చేరవచ్చన్నారు. ఇప్పటికే సభ్యత్వం ఉన్న వారు తమ వ్యక్తిగత వివరాల్లో మార్పులు ఉంటే వెంటనే నవీకరించుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు కోసం మోర శంకరమూర్తి 63051 78278, సంగెం రామకృష్ణ 99081 81339లను సంప్రదించాలని తెలిపారు.
పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
రేగొండ: పశువులను అక్రమ రవాణాచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సంపత్‌రావు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరైన ధృవపత్రాలు లేకుండా పశువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ సంఘాల వ్యక్తులని వాహనాలను తనిఖీ చేయరాదని, చట్టాన్ని చేతులోకి తీసుకునే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, అక్రమ రవాణాను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గణపురం సీఐ కరుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.


