ములుగు రూరల్: మక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మల్లంపల్లి మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు ఎదురైతే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొండెం రవీందర్‌రెడ్డి, కిసాన్ సెల్ అధక్షుడు గోల్లపలి రాజేందర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క


