పోచమ్మ తల్లికి బోనాలు | - | Sakshi
Sakshi News home page

పోచమ్మ తల్లికి బోనాలు

May 1 2026 5:57 AM | Updated on May 1 2026 5:57 AM

భూపాలపల్లి: పట్టణంలోని సుభాష్‌కాలనీ పోచమ్మ దేవాలయంలో గురువారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ పునఃప్రతిష్ఠాపన చేసి ఏడాదయిన సందర్భంగా బుధవారం సాయంత్రం అమ్మవారికి అభిషేకం, గురువారం ఉదయం హోమం, పోత లింగన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. సాయంత్రం సుభాష్‌కాలనీ, రాంనగర్‌ కాలనీ, మిలీనియం క్వార్టర్స్‌కు చెందిన మహిళలు పెద్దఎత్తున పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆయా కార్యక్రమాల్లో 29, 17వ వార్డుల కౌన్సిలర్లు గండ్ర హరీశ్‌రెడ్డి, బీర్తి కమల, మాజీ జెడ్పీటీసీ లట్ట రాజబాబు, ఆలయ కమిటీ సభ్యులు రాజమౌళి, చిట్టిబాబు, ప్రసాద్‌, రాజేందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement