న్యూస్‌రీల్
జయశంకర్ భూపాలపల్లి
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026
7
పింఛన్ల మంజూరుకు ఎదురుచూపు
భూపాలపల్లి రూరల్: ఆసరా పింఛన్ల కోసం అర్హులకు ఎదురుచూపు తప్పడం లేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ కూడా ప్రభుత్వం నాలుగేళ్లుగా బంద్ చేసింది. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చింది. అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయకపోవడంతో వారంతా అందోళన చెందుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. దీంతో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.
2022 ఆగస్టు నుంచి ఆగిన ‘ఆసరా’
రాష్ట్ర వ్యాప్తంగా 2022 ఆగస్టు నుంచి కొత్తగా అసరా పింఛన్ల మంజూరును అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. అప్పటికే జిల్లాలో చాలామంది దరఖాస్తు చేసుకున్నా వివిధ కారణాలతో వాటిని తిరస్కరించింది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే పోర్టల్ క్లోజ్ చేయడంతో కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో నాలుగేళ్ల నుంచి దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు అధికారులకు నేరుగా దరఖాస్తులు ఇస్తున్నారు తప్ప మంజూరు కావడం లేదు. కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం ప్రజావాణిలోనూ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. అయినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో అర్హులైన వారికి ఎదురుచూపు తప్పడం లేదు.
ఎన్నికల హామీ నెరవేరుతుందా..!
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా ఇప్పటి వరకు అమలు కాలేదు. ఎన్నికల హామీలో భాగంగా పింఛన్ల పెంపును అమలు చేయడంతో పాటు కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు అందిస్తారని కోటి ఆశలతో ఉన్నారు. ప్రభుత్వం తప్పకుండా పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.
2022 నుంచి నిలిచిన
పెన్షన్ మంజూరు
పోర్టల్‌ను పూర్తిగా మూసేసిన ప్రభుత్వం
దరఖాస్తులను కూడా
ఆన్‌లైన్ చేయలేని పరిస్థితి
కార్యాలయాల చుట్టూ
ప్రదక్షిణలు చేస్తున్న అర్హులు
జూన్‌లో ఇస్తామని ప్రభుత్వ ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు


