మిషన్‌ కాకతీయకు భారీ ఊతం | - | Sakshi
Sakshi News home page

మిషన్‌ కాకతీయకు భారీ ఊతం

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌: జిల్లాలో సాగునీటి వనరుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిషన్‌ కాకతీయ పనులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. గణపసముద్రం పెద్ద చెరువు కాలువల ఆధునికీకరణతో పాటు భీమ్‌ఘన్‌పూర్‌ చెరువు అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు జారీచేసింది. గణపసముద్రం చెరువు పరిధిలో కాలువల పునరుద్ధరణ, లైనింగ్‌, నిర్మాణ బలోపేతం పనులు చేపట్టనున్నారు. భీమ్‌ఘన్‌పూర్‌ చెరువులో నీటి నిల్వ సామర్థ్య పెంపు, కాలువల మరమ్మతులు, నీటి ప్రవాహం మెరుగుపరిచే పనులు నిర్వహించనున్నారు.

రెండు పనులకు రూ.59 కోట్లు..

గణపసముద్రం పెద్ద చెరువు కాలువల ఆధునికీకరణకు రూ.30.95 కోట్లు, భూపాలపల్లి మండలంలోని భీమ్‌ఘన్‌పూర్‌ చెరువు అభివృద్ధి పనులకు రూ.28.02 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు కలిపి సుమారు రూ.59 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం ఈ పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. నల్లరేగడి, ఉబ్బే స్వభావం ఉన్న నేలల్లో తప్పనిసరిగా సీసీ లైనింగ్‌ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులో ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కాలువలు దెబ్బతినకుండా ఉండటంతో పాటు నీటి లీకేజీలు తగ్గి, సాగునీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

పనులకు ప్రధాన నిబంధనలు ఇవీ..

ములుగు సీఈకి పర్యవేక్షణ బాధ్యతలు..

ఇరిగేషన్‌, మిషన్‌ కాకతీయ విభాగం ఆధ్వర్యంలో అమలు చేయాలని, కాలువల హైడ్రాలిక్‌ డిజైన్లకు ముందస్తు సాంకేతిక అనుమతులు తప్పనిసరిగా పేర్కొంది. సీసీ లైనింగ్‌ కాలువలకు బలమైన రక్షణ ఉండేలా చూడాలని సూచించారు. పనుల పర్యవేక్షణ బాధ్యతను ములుగు చీఫ్‌ ఇంజనీర్‌కు అప్పగించిన ప్రభుత్వం.. డిజైన్లు, అంచనాలు సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, అంచనాల్లో పేర్కొన్న వివరాల ఖచ్చితత్వానికి చీఫ్‌ ఇంజనీర్‌దే బాధ్యతని స్పష్టం చేశారు.

చెరువులు, కాలువల

ఆధునికీకరణ నిధులు

రూ.59 కోట్లు మంజూరు చేస్తూ

ఉత్తర్వులు

గణపసముద్రం, భీమ్‌ఘన్‌పూర్‌ చెరువు,

కాల్వలకు మహర్దశ

Advertisement
 
Advertisement
Advertisement