తునికాకు సేకరణ | - | Sakshi
Sakshi News home page

తునికాకు సేకరణ

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

మామపై దాడి చేసిన అల్లుడి అరెస్టు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మహాముత్తారం: మండలంలోని జీలపల్లి, మాదారం, మహాముత్తారం, సింగారం, యామన్‌పల్లి గ్రామాల్లోని గిరిజనులు, గిరిజనేతరులు నాలుగు రోజులనుండి గ్రామసమీపంలోని అడవుల్లో తునికాకు సేకరణ చేపడుతున్నారు. ఉదయం సేకరించిన ఆకును కట్టలు కట్టి కల్లోకి చేరవేస్తున్నారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే యూనిట్లు టెండరయ్యాయి. మరికొన్ని గ్రామాల్లో తునికాకు టెండర్లు కాకపోవడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆదాయాన్ని కోల్పోతున్నారు.

పరామర్శ

మహాముత్తారం: మండలంలోని వజినేపల్లి గ్రామానికి చెందిన దుర్గం సమ్మయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్నా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సునీల్‌రెడ్డి, చల్ల నారాయణరెడ్డి బుధవారం వజినేపల్లిలో వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు పూర్ణచందర్‌, నాయకులు రఫీ, దుర్గం తిరుపతి తదితరులు ఉన్నారు.

ఆర్డీఓకు సన్మానం

మల్హర్‌(కాటారం): మండలంలోని కాటారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన రవీందర్‌ను బుధవారం ఈజీఎస్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు దండు రమేష్‌, కాంగ్రెస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్డీఓను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పంతకా ని సమ్మయ్య, కొండగొర్ల రాంనారాయణ, ఆ త్మకూరి కుమార్‌యాదవ్‌ పాల్గొన్నారు.

టేకుమట్ల: మామపై దాడి చేసిన అల్లుడి అరెస్టు చేసిన సంఘటన మండలంలోని గుమ్మడవెల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన ఆకినపల్లి హరీశ్‌ తన మామ మొలుగూరి సదానందం మధ్య ఇటీవల వాగ్వాదం జరిగింది. తీవ్ర కోపోద్రిక్తుడైన హరీశ్‌ ఆయన మామ సదానందంను కర్రతో బలంగా కొట్టాడు. సదానందం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా జడ్జి పరకాల జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అమూల్య తెలిపారు.

మహాముత్తారం: మండలంలోని బోర్లగూడెం గ్రామంలో జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బోర్లగూడెం సర్పంచ్‌ అజ్మీరా ధరమ్‌సింగ్‌ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంటర్‌ ఇన్‌చార్జ్‌ సీతునాయక్‌ ,రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement