బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

మల్హర్‌(కాటారం): నీట్‌–2026 పరీక్షలో జరిగిన పేపర్‌ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్‌పై దాడి జరిగిందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని కాటారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిరణ్‌ మాట్లాడారు. దేశంలో ఇప్పటికే నిరుద్యోగం, కార్పొరేట్‌ విద్యా వ్యవస్థ, కోచింగ్‌ మాఫియా భారంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులపై ఇది మరో మోసపూరిత దాడి అని ఆరోపించారు. పరీక్షకు ముందు ప్రశ్నాపత్రం బయటకు రావడం, అనేక ప్రశ్నలు అసలు పరీక్షతో సరిపోవడం, తదనంతరం పరీక్ష రద్దు వరకు వెళ్లడం దేశ పరీక్షా వ్యవస్థ పూర్తిగా వైఫల్యానికి గురైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాయన్నారు. నీట్‌ పేపర్‌ లీకేజీపై సిట్టింగ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఫ్రంట్‌ జిల్లా నాయకులు అయిత బాపు, దాసరి రమేష్‌, దారకొండ సూర్యశంకర్‌, వెంకటేశ్వర్లు. తదితరులు పాల్గొన్నారు.

టీపీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్‌

Advertisement
 
Advertisement
Advertisement