భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో సవాళ్లను అధిగమిస్తూ సంస్థను ముందుకు నడిపించాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి కోరారు. ఈ నెల 18నుంచి నిర్వహించనున్న మల్టీ డిపార్ట్‌మెంటల్ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఏరియాలోని జీఎం తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి అభివృద్ధిలో ప్రతీ ఉద్యోగి కీలకపాత్ర పోషించాలన్నారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలన్నారు. పని గంటలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యక్తిగత అభివృద్ధితో పాటు సంస్థ అభివృద్ధికి తోడ్పడుతూ నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపునకు కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం కవీంద్ర, అధికారులు జోతి, డాక్టర్ పద్మజ, భిక్షమయ్య, మాటూరి రవీందర్, రాజేశ్వర్, కృష్ణప్రసాద్, శైలేంద్రకుమార్, శ్యాంసుందర్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు మధుకర్‌రెడ్డి పాల్గొన్నారు.


