మంగపేట : మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పలుచోట్ల చిరు జల్లులు పడగా కొత్తూరుమొట్లగూడెంలో గాలిదుమారం భారీగా వచ్చింది. దీంతో పలుచోట్ల కోత దశకు వచ్చిన వరిపైరు నేలవాలింది. మేల్‌ఫిమేల్ వరిపైరు సైతం నేలవాలడంతో వడ్లు రాలిపోగా తీవ్రంగా నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. గాలివాన దాటికి గుడిసెల పైకప్పులు ఎగిరిపోవడంతో ఇళ్లలోని బట్టలు, గృహోపకర వస్తువులు తడిసిపోయాయి. ఉన్నతాధికారులు పంటనష్టంపై పరిశీలించి ప్రభుత్వం ద్వారా పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.


