కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలి

May 1 2026 5:57 AM | Updated on May 1 2026 5:57 AM

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలి

మల్హర్‌(కాటారం): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని ఈజీస్‌ రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ దండు రమేష్‌, కాటారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పంతకాని తిరుమల, రేగులాగూడెం సర్పంచ్‌ ఆమని సురేష్‌ అన్నారు. గురువారం మండలంలోని రేగులగూడెంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతాంగ సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీతో పాటు సన్న వడ్లకు బోనస్‌, రైతు భరోసా, సబ్సిడీ యంత్రాల పంపిణీతో రైతును రాజు చేయాలనే ప్రధాన సంకల్పంతో ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్‌ పిల్లమరి రమేష్‌, పీఏసీఎస్‌ ప్రత్యేక అధికారి రాజు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు ఆంగోతి సుగుణ, డీసీసీ జనరల్‌ సెక్రెటరీ కుంభ స్వప్నరెడ్డి, అధికార ప్రతినిధి పంత కాని సమ్మయ్య, నియోజకవర్గ యూత్‌ అధ్యక్షులు చీమల సందీప్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement